కాఫీ షాపులో ఉచిత వైఫై ఉందా అయితే ఈ ఆర్టిక‌ల్ నీ కోస‌మే!

ఇంట‌ర్నెట్ అనేది ఇప్పుడు చాలా కామ‌న్ విష‌యం. ప్ర‌తి ఇంట్లో వైఫై ఉంటుంది. మ‌నం బ‌య‌ట‌కు వెళ్లినా మొబైల్ నెట్‌వ‌ర్క్ ఫెయిల్ అయింద‌ని బాధ‌ప‌డ‌క్క‌ర్లేదు. ఎందుకంటే ప‌బ్లిక్ వైఫై ఎక్క‌డైనా మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. బ‌స్ స్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేష‌న్లు ఒక‌టేమిటి చివ‌రికి కాఫీ షాపుల్లోనూ వైఫై మ‌న‌కు అందుబాటులో ఉంటుంది. అయితే కాఫీ  షాపుల్లో వైఫై ఉన్నప్పుడు వాళ్లు మీకు పాస్‌వ‌ర్డ్ ఇచ్చి వాడుకోండని చెప్పార‌నుకోండి. ఒక్క నిమిషం ఆలోచించండి.. ఎందుకంటే..!

సాధార‌ణంగా టూరిస్టులు వైపైల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. హోట‌ల్స్‌, కాఫీ షాపుల్లో వాళ్లు త‌మ‌కు వైఫై ఆఫ‌ర్ ఉందా అని అడుగుతారు. అయితే ఇలా ఉచితంగా ల‌భించే ఇంట‌ర్నెట్ వెనుక ప్ర‌మాదం కూడా పొంచి ఉంది. హ్యాక‌ర్లు మీ డేటాను త‌స్క‌రించ‌డానికి ఎల్ల‌వేళ‌లా సిద్ధంగా ఉంటారు. గూగుల్‌, గ్లోబ‌ల్ రిసెర్చ్ తాజా స‌ర్వేల ప్ర‌కారం భార‌త్ ప‌బ్లిక్ వైఫై అంత సుర‌క్షితం కాద‌ని తేలింది.  2019 నాటికి భార‌త్‌లో దాదాపు 40 మిలియ‌న్ల మంది జ‌నం ఈ ప‌బ్లిక్ వైఫైని వాడుతున్నార‌ట‌. దీని వ‌ల్ల రూ.138000 కోట్ల రూపాయిల డ‌బ్బులు కూడా వృథా అవుతున్నాయి. ఎందుకంటే వీళ్లంద‌రూ ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ తీసుకుంటే భారత జీడీపీ కూడా పెరుగుతుంది. 

ర‌ష్యాకు చెందిన కాస్ప‌ర్‌స్కై నివేదిక ప్ర‌కారం 70 శాతం మంది ట్యాబ్లెట్లు ఉప‌యోగించే వాళ్లు, 53 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వాడేవాళ్లు తాము ప‌బ్లిక్ వైవై మీదే ఎక్కువ ఆధార‌ప‌డుతున్న‌ట్లు చెప్పార‌ట‌. అందుకే హ్యాక‌ర్ల‌కు ఈ ప‌బ్లిక్ వైఫై అడ్డాగా మారిపోయింద‌ని... విలువైన స‌మాచారాన్ని వీళ్లు వైఫై ద్వారా లాగేస్తున్నార‌ని కూడా ఈ స‌ర్వే తేల్చింది.  ఎందుకంటే సాధార‌ణ వైఫై కంటే ప‌బ్లిక్ వైఫైని హ్యాక్ చేయ‌డం చాలా సుల‌భం.  అందుకే పబ్లిక్ వైఫైని అత్య‌వ‌స‌రం అయ‌తే త‌ప్ప వాడొద్ద‌ని.. అన్ని చోట్లా వాడొద్ద‌ని నిపుణులు చెబుతున్నారు. 

Free Wi-Fi Coffee Shop danger hacking